వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తనతో రానన్నందుకు ఆమె గొంతు కోసిన ఆటో డ్రైవర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Auto driver slits woman's throat
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కక్కిరాలపెల్లి క్రాస్‌రోడ్డు వద్ద వివాహిత మారేపల్లి లత (25)పై గవిచర్లకు చెందిన ఆటోడ్రైవర్ వేల్పుల నవీన్ దాడి చేసి బ్లేడుతో గొంతు కోశాడు. భర్తతో వివాదం ఏర్పడటంతో లత ఆరేళ్లుగా తన కుమారుడితో కలసి విడిగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న నవీన్ మంగళవారం ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రావడంతో వెంటపడ్డాడు.

తనతో రావాలంటూ బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని వర్ధన్నపేట వైపు తీసుకునివెళ్లాడు. క్రాస్‌రోడ్ వద్ద ఆటోను నిలిపి తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో చంపేస్తానంటూ బ్లేడ్‌తో గొంతు కోశాడు. లత గొంతు నుంచి రక్తంకారడంతో కంగారుపడ్డ నవీన్ ఆమెను అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు.

రైతు ఆత్మహత్య...

వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు కంచర్ల భద్రయ్య(45) పంటలకోసం చేసిన అప్పుల బాధను భరించలేక సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి - భద్రయ్యకు రెండున్నర ఎకరాలు సొంత భూమితోపాటు మరో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా పత్తి పంట మూలంగా అప్పుల పాలయ్యాడని, ఇదే క్రమంలో ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో వ్యవసాయం చేయడం లో ఇబ్బందులు పడేవాడన్నారు. కూ తురు పెళ్లికోసం చేసిన అప్పులు, పంట ల పెట్టుబడుల కోసం చేసిన అప్పులు భద్రయ్య కుటుంబానికి మోయలేని భారమయ్యాయి.

పత్తి పంట దిగుబడి రాకపోవడంతో మధ్యలోనే పత్తి చెట్లను తొలగించి మొక్కజొన్న సాగు చేశాడని, పంట ఎదుగుతున్న సమయంలో కరెంట్‌లేక సాగు నీరు అందక 4ఎకరాల పంట ఎండిపోయింది. పంట చేతికి అందే పరిస్థితి లేక భద్రయ్య మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. దీంతో భద్రయ్య సోమవా రం రాత్రి తన చేను వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి గడ్డివాము వద్ద చెద్దరు కప్పుకొని పడుకుని అలాగే మృతి చెందాడని వారు చెప్పారు.

English summary
An auto driver has chopped a woman's throat for rejecting his proposal for a relation. This incident occured at Vardhannapet of Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X