వైయస్ నుండే మొదలు: జగన్‌పై బాబు, నాకే బాధెక్కువ

Chandrababu Naidu
రాజమండ్రి: రాష్ట్రం పతనావస్థ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నుండే ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో ఆయన విద్యుత్ సంక్షోభంపై విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే రాష్ట్రం కారుచీకట్లలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెసు తన తొమ్మిదేళ్ల పాలనలో రాష్టాన్ని అస్తవ్యస్తంగా మార్చారన్నారు.

విద్యుత్ వ్యవస్థను నీరుగార్చారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు.. వీరివల్లే రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడిందని ఆరోపించారు. పవర్ ప్రాజెక్టులకు ఇష్టానుసారంగా దోచిపెట్టారన్నారు. విద్యుత్ సమస్యపై తమ ఎమ్మెల్యేలు నిలదీస్తే ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి తప్పించుకుందన్నారు. సభ నడుపలేక వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు.

టిడిపి హయాంలో నాణ్యమైన విద్యుత్‌ను తొమ్మిది గంటలు సరఫరా చేశామని, వైయస్ వచ్చి ఏడు గంటల ఉచిత్ విద్యుత్ అని చెప్పి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. కిరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్నారు. ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టుల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో తయారవుతున్న విద్యుత్ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తోందన్నారు.

ప్రణాళికలు లేకుండా ప్రభుత్వం నడుస్తోందన్నారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడంతోనే ప్రభుత్వ అసమర్థత అర్థమవుతోందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను ఒక్క టిడిపి మాత్రమే అందించిందన్నారు. కరెంట్ కష్టాలకు కారణమైన వారిని దోషులుగా నిలబెట్టాలన్నారు. విద్యుత్ సరిగా ఇవ్వకున్నా ప్రజల పైన ప్రభుత్వం రూ.32వేల కోట్ల భారం వేస్తోందని మండిపడ్డారు. ఎస్సెమ్మెస్‌తో సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ప్రభుత్వం ఎస్సెమ్మెస్‌తో పని చేసే పరిస్థితిలో ఉందా అన్నారు.

రాష్ట్రం తీరు చూసి అందరికంటే ఎక్కవగా బాధపడే వ్యక్తిని తానే అన్నారు. టిడిపి హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. బిల్లులు కట్టినా పంటలు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ హయాంలో విద్యుత్‌కు చాలా ప్రాధాన్యం ఇచ్చే వారమని, నిత్యం సమస్యలు తెలుసుకొని సమీక్షించే వాడినన్నారు. అప్పుడు జవాబుదారీతనం తీసుకు వచ్చానన్నారు. విద్యుత్ పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు పడితేనే విద్యుత్ ఇస్తామని కిరణ్ విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు. ఇరవై ఏళ్లలో ఇంత విద్యుత్ సంక్షోభాన్ని ఎప్పుడు చూడలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+