రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీతపై రేప్ కేసు

సతారాకు సమీపంలోని జకత్వాడీలో గల ఆశ్రమ్ శాల (గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాల)లో ఆ ముగ్గురు మహిళలు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. పాఠశాలలో తమ ఉద్యోగాలను కన్‌ఫర్మ్ చేస్తానని చెప్పి తమపై అత్యాచారం చేశాడని వారు ఆరోపించారు. పాఠశాలకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు.
పెళ్లిళ్లు చేసుకున్న ముగ్గురు మహిళల వయస్సు 30, 35 మధ్య ఉంటుంది. మానే తమపై 2003, 2010 మధ్య కాలంలో అత్యాచారం చేశాడని వారు ఆరోపించారు. మానే నివాసం సతారా ఉంది. పూణేలో ఓ అతిథి గృహం ఉంది.
తాము మానేను పట్టుకోవడానికి ఇంటికి వెళ్లామని, అతను ఎక్కువగా వెళ్లే చోట్లకు కూడా వెళ్లామని, కానీ అతని జాడ కనిపించలేదని పోలీసులు అంటున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అదనపు పోలీసు సూపరింటిండెంట్ అమోల్ తాంబే చెప్పారు.
తన తండ్రిపై తప్పుడు కేసులు బనాయించారని, తమ తండ్రిపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, పాఠశాలకు చెందిన కొంత మంది తమ తండ్రిని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కుట్ర చేశారని మానే కుమారుడు భాయ్ అంటున్నారు. ఆయన భార్య శశితాయ్ కూడా ఆరోపణలను ఖండించారు.
మానేకు 1981లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2009లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మానే పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని స్థానిక శివసేన, బిజెపి, ఇతర రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications