జగన్‌ను కలిసిన టిడిపి మాజీ: సర్వేకు చేదు అనుభవం

YS Jagan - Sarve Satyanarayana
హైదరాబాద్/ఏలూరు: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు భగ్గు లక్ష్మణ రావు మంగళవారం కలిశారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విధానాలతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టవలసిన చంద్రబాబు పారిపోయారన్నారు. కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని విమర్శించారు. ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ నాయకత్వం నచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నానని ఈ సందర్భంగా భగ్గు లక్ష్మణ రావు అన్నారు. అనంతరం ఆయన వైయస్ విజయమ్మ దీక్షకు మద్దతు పలికారు.

సర్వేకు చేదు అనుభవం

కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. కొద్ది రోజుల క్రితం ఆయన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైయస్ కుక్క కన్నా హీనంగా చనిపోయాడని సర్వే అన్నారు. ఆ తర్వాత అతను తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు.

అయితే, ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ భీమవరంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైయస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత సర్వే క్షమాపణలు చెప్పారు.

కాగా, సర్వే మాట్లాడుతూ.. తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాదులో దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఉన్నప్పుడు సీమాంధ్ర ప్రజలు ఉంటే తప్పేమిటన్నారు. జగన్ ఆస్తులు సేకరిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీరుతాయన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే జగన్ పార్టీ స్థాపించారని, కాంగ్రెసులో ఉంటే జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+