వ్యతిరేకించాం... మాపై వేటేయండి: జగన్ ఎమ్మెల్యేలు

శుక్రవారం మధ్యాహ్నం వారు స్పీకర్‌కు లేఖ రాశారు. అవిశ్వాసం సమయంలో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్షలో పాల్గొన్నామని పేర్కొన్నారు. తమ శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే వాటిని నోటిఫై చేసి ఉప ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ రాశారు. కాంగ్రెసు పార్టీకి చెందిన సుజయ కృష్ణ రంగారావు, జోగి రమేష్, మద్దాల రాజేష్, ఆళ్ల నాని, గొట్టిపాటి రవి కుమార్, శివప్రసాద్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన వనిత, ప్రవీణ్ కుమార్, బాలనాగి రెడ్డి, సాయిరాజ్, అమర్నాథ్ రెడ్డి తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు.
జెఏసి ఆందోళన
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణవాద పార్టీల మధ్య విభేదాలు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితికి ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణవాదం బలంగా వినిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పడం ఐకాసకు ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications