పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి, బాపు (పిక్చర్స్)

న్యూఢిల్లీ: 2012-13కుగాను పద్మా అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం నాడు ఢిల్లీలో ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాల కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో జరిగింది. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, క్రికెటర్ రాహుల్ డ్రావిడ్, ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మా అవార్డులను అందజేశారు.

పద్మవిభూషన్, పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రతిభావంతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

షర్మిలా ఠాగూర్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. శ్రీదేవి పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. 42 మందికి రాష్ట్రపతి పద్మ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు పద్మభూషణ్ అవార్డును తీసుకున్నారు. పద్మశ్రీ అవార్డును అందుకున్నవారిలో గజం అంజయ్య కూడా ఉన్నారు.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న నటి శ్రీదేవి.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

రాష్ట్రపతి నుంచి పద్మ భూషణ్ అవార్డును స్వీకరిస్తున్న క్రికెటర్ రాహుల్ ద్రావిడ్.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

వందనా లుథారాకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

జయశ్రీకి పద్మశ్రీ అవార్డును అందిస్తున్న రాష్ట్రపతి.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

ప్రొఫెసర్ యశ్‌పాల్‌ రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అవార్డును అందుకుంటూ..

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

బజరంగ్ లాల్ ఠక్కర్‌కు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

అచ్యుత్ బద్వేకు పద్మశ్రీ అవార్డును అందిస్తున్న రాష్ట్రపతి.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకుంటున్న డిఆర్‌డివో డిజి వికె సరస్వత్.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

బాక్సర్ గాంగోమ్ దింగ్కో సింగ్‌కు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

సురేంద్ర శర్మకు పద్మశ్రీ అవార్డును అందిస్తున్న ప్రణబ్ ముఖర్జీ.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తదితరులు.

పద్మా అవార్డులను అందుకున్న శ్రీదేవి (పిక్చర్స్)

పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తదితరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+