జగన్ పార్టీలోకి: మళ్లీ మనసు మార్చుకున్న జయప్రద!

ఆదివారం ఆమె మరో ట్విస్ట్ ఇచ్చారు. తాను ప్రాంతీయ పార్టీలోనే చేరుతానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, ఏ పార్టీ అనే విషయాన్ని మాత్రం నెలాఖరు వరకు చెబుతానని ఆమె అన్నారు. టిడిపి నుండి జగన్ పార్టీ తర్వాత బిజెపి ఇప్పుడు మరలా ప్రాంతీయ పార్టీ అని ఆమె చెబుతుండటంతో ఆమె ఏ పార్టీలో చేరాలో ఇంకా తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించడం అదే సమయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పొగిడిన నేపథ్యంలో జగన్ గూటికే చేరాలని ఆమె ఓ నిర్ణయానికి దాదాపు వచ్చారని అంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం హీరో నందమూరి బాలకృష్ణ ఆమెపై కామెంట్ కూడా చేశారు. ఆమె తనను కలిస్తే పార్టీ పెద్దలతో మాట్లాడుతానని అయితే, జయప్రద రోజుకో పార్టీ అంటున్నారని చురక వేశారు.












Click it and Unblock the Notifications