కుటుంబ సభ్యులకూ హక్కు లేదు: హరికృష్ణకు కళా

Kala Venkat Rao
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పేటెంట్ హక్కు అని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సోమవారం అన్నారు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ వ్యాఖ్యలపై కళా వెంకట్రావు స్పందించారు. టిడిపి, పసుపు రంగు జెండా, సైకిల్ గుర్తు ఉన్నంత కాలం ఎన్టీఆర్ తమ పార్టీకే చెందుతారని వెంకట్రావు ఈ సందర్భంగా అన్నారు.

ఆయనపై టిడిపికి తప్ప ఎవరికీ పేటెంట్ లేదన్నారు. ఆయన ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వినియోగించుకోవద్దన్నారు. ఆయన ఫోటోను పెట్టుకునే హక్కు జగన్ పార్టీకి ఏమాత్రం లేదన్నారు. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు ఉండవచ్చునని, వాటిపై తాము స్పందించమన్నారు. అది వారి కుటుంబ వ్యవహారమని కళా వెంకట్రావు చెప్పారు.

అయితే, స్వర్గీయ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా టిడిపికి మాత్రమే చెందిన వారన్నారు. ఎన్టీఆర్‌పై టిడిపికి ఉన్న పేటెంట్ హక్కును ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా లేదని కళా వెంకట్రావు ఈ సందర్భంగా చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్దదని, అంత పెద్ద కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న తగాదాలు సహజమేనని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.

కాగా అంతకుముందు హరికృష్ణ వరంగల్ జిల్లాలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఫోటోను ఎవరైనా వినియోగించుకోవచ్చునని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన పేద ప్రజల మనిషి అని, ప్రతి పేదవాడి ఇంటిలో ఆయన ఫోటో ఉంటుందని, అలాంటి వ్యక్తి ఫోటోను అందరు ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+