తేల్చని జూనియర్ ఎన్టీఆర్: బాలయ్య డైలమా

తన తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కానీ, బాలకృష్ణతో గానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో గానీ కలిసి ఉంటానని, వారికి మద్దతు ఇస్తానని ఆయన చెప్పలేదు. పైగా, తనను వివాదాల్లోకి లాగవద్దని కోరుతూ వివాదం నుంచి అత్యంత చాకచక్యంగా జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నారని అంటున్నారు.
తన తాతగారు ఎన్టీ రామారావుకు ఉన్నట్లుగానే, తనకు కూడా అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి తగిన ప్రాతిపదికను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. రాజకీయాలను పట్టించుకోవడం లేదని కూడా ఆయన అనవచ్చు. తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, తనకు సినిమాలే ముఖ్యమని చెప్పి తప్పుకునే అవకాశం కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు ఉంది.
దానికి తగిన ప్రాతిపదికను తన ప్రకటన ద్వారా తండ్రి హరికృష్ణ ప్రకటన తయారు చేసి పెట్టిందని అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫొటోను పెట్టుకుంటే తీసేయాలని అడగడం ఏం వ్యభిచారమని హరికృష్ణ ఘాటుగా అడిగారు. ఇది బాలకృష్ణకు నేరుగా తగిలేలా ఉందని అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫొటోను అభిమానులు పెట్టుకున్నట్లే జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను కూడా పెట్టుకుంటే తప్పేమిటనే వాదన ముందుకు వచ్చే అవకాశం ఉంది.
నందమూరి కుటుంబంలో అంతా ఒక్కటై బాలకృష్ణను వ్యతిరేకిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు కూడా హరికృష్ణ వ్యాఖ్యల మాదిరిగానే ఉన్నాయి. ఫొటోల వాడకంపై తెలుగుదేశం పార్టీ గుత్తాధిపత్యం లేదని చెప్పేందుకు వారిద్దరు ప్రయత్నించినట్లు చెప్పుకోవచ్చు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా విలసిల్లిన ఎన్టీ రామారావు బొమ్మలను ఎవరైనా పెట్టుకుంటారని అంటున్నారు.
బాలకృష్ణ హెచ్చరికను పరిగణనలోకి తీసుకున్నట్లే తీసుకుని మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ వివాదం సద్దుమణగడానికి అవసరమైన ప్రకటన మాత్రం చేయలేదు. తన బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా చెప్పాలనేది బాలకృష్ణ ఉద్దేశ్యం. తన ఫొటోల వాడకంపై తనకు ఏ విధమైన సంబంధం లేదని, అభిమానులు వాడుకుంటే తాను ఎలా కాదనగలనని వాదించేందుకు అనువైన విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన ఉంది.
కర్ర విరగకుండా పాము చావకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేయడంతో అయోమయం యధావిధిగా కొనసాగే అవకాశాలున్నాయి. పైగా, జూనియర్ ఎన్టీఆర్ నుంచి సీనియర్ ఎన్టీ రామారావు బొమ్మలకు మాత్రమే పరిమితం కాకుండా హరికృష్ణ బొమ్మలను వాడుకోవడం దాకా వ్యవహారం వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీకి పరిష్కరించడానికి కష్టమైన కార్యమే.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications