"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన మూవీ "ధురంధర్". ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా చేయగా.. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ ' - ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో దక్షిణాది భాషలన్నింటిలోనూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. ధురంధర్ 2 దాదాపు 4 గంటలు ఉండగా అంత సేపు ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టడంలో డైరెక్టర్ ఆదిత్య ధార్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. పంజాబ్‌లోని ఓ సాధారణ ఆర్మీ జవాన్ కొడుకైన జస్కిరాత్.. హమ్జాగా మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? అనే విషయాన్ని చాలా బలంగా చూపించాడు. ఇక దేశభక్తితో జవాన్ అవుదామనుకున్న కుర్రాడ్ని అదే దేశంలోని రాజకీయం ఒక హంతకుడ్ని చేసిన తీరు ఎమోషనల్‌గా అనిపిస్తుంది.

ఇక రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీలో చెలరేగిన అల్లర్లు.. అతని సోదరుడు ఉజెయిర్ బలోచ్‌ని చాలా తెలివిగా హమ్జా ట్యాకిల్ చేసిన తీరు.. ఇవన్నీ మెప్పిస్తాయి. ఇక పాకిస్థాన్ రాజకీయాల్లో హమ్జా ఎదిగిగిన తీరు.. దాని కోసం వేసిన ఎత్తులు కూడా ఆడియన్స్‌కి కిక్కిస్తాయి. నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలని స్టోరీకి లింక్ చేయడంలో కూడా ఆదిత్య టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఉరి, దురంధర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ఆదిత్య ధర్. దాంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీ గురించి జోరుగా చర్చ నడుస్తోంది.
నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే..?
కాగా ప్రస్తుతం ఆదిత్య ధర్ "దురంధర్" పార్ట్-3 తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తుంది. కానీ తాజాగా అందిన సమాచారం మేరకు.. ఈ యంగ్ డైరెక్టర్ "అశ్వత్థామ" ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఇండియన్ మైథాలజీలో 'అశ్వత్థామ' క్యారెక్టర్ ను ఆధారంగా చేసుకుని రాసుకున్న సినిమా అని అంటున్నారు. ఈ సినిమాని విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ గతంలోనే ప్రారంభించారు. కానీ భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ (VFX), లాజిస్టికల్ ఇష్యూస్ ఉండటంతో ఈ సినిమాని అప్పట్లో నిలిపివేశారు. కానీ ఇప్పుడు దురంధర్ భారీ హిట్ సాధించడంతో.. ఆ సినిమాకి నిర్మాతలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications