రాష్ట్ర బంద్: నారాయణ, రాఘవులు అరెస్ట్

బస్సులను బయటకు రానీయకుండా వారు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రాఘవులు, నారాయణలతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ తదితర ముఖ్య పట్టణాలలో బంద్ కొనసాగుతోంది. సిపిఐ, సిపిఎం కార్యకర్తలు ఉదయమే విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద బస్సులను అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ఛార్జీలను తగ్గించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. అనంతపురం బస్టాండు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. బస్సులను అడ్డుకున్నారు. కర్నూలు జిల్లాలో ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలు బస్సు డిపోల నుండి ఆందోళన కారణంగా బస్సులు బయటకు రాలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో బందులో పాల్గొన్నారు.
హింసకు పాల్పడితే చర్యలు: డిజిపి
బంద్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డిజిపి దినేష్ రెడ్డి హెచ్చరించారు. బంద్ నేపథ్యంలో సోమవారం ఆయన తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచే బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications