రాహుల్‌కి మోడీ పిజ్జా కౌంటర్: పవర్స్‌పై బాబు చెప్పారు

గత వారం సిఐఐలో ఆసక్తికరమైన ప్రసంగం చేసిన రాహుల్.. మోడీ ఒక్కడివల్లా ఏమీ కాదని, వ్యవస్థలు తయారు చేయనిదే ఏమీ జరగదని చురకలు అంటించారు. గతంలో రాహుల్ గాంధీ లోక్‌సభలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన కళావతి అనే వితంతువు దీనగాథను, కష్టాలను పల్లె వేశారు. నిన్నటి సదస్సులో మోడీ మాత్రం తన రాష్ట్రంలోని జస్సుబెహన్ అనే మహిళ విజయగాధను వినిపించారు.
అహ్మదాబాద్‌లో జస్సుబెహన్ పిజ్జా చాలా ప్రాచుర్యం పొందిందని, పిజ్జాహట్ లాంటి పెద్ద కంపెనీల పిజ్జాల కంటే కూడా ఆమె తయారు చేసేవే కావాలని చాలామంది వెళ్తుంటారని చెప్పారు. జస్సూబెహెన్ పిజ్జాలకు పిజ్జా హట్‌లు పారిపోయాయన్నారు. ఇప్పుడిలా చెప్పానని ఆమె ఇంటర్వ్యూ కోసం పాత్రికేయులు వెళ్తారేమోనని, ఐదేళ్ల క్రితమే ఆమె చనిపోయారని చెప్పారు.
కానీ ఇప్పటికీ ఆ పిజ్జాలకు బోలెడంత మార్కెట్ ఉందని చెప్పారు. ఇక తానూ అందరిలాంటి సామాన్యుడినేనని, తనలోనూ లోపాలున్నాయని చెప్పారు. వాటిని సరిచేయాల్సింది మీరేనంటూ మహిళలను కోరారు. ఉన్న వ్యవస్థలను బాగా పనిచేసేలా చేయాలని, అవసరమైతే వ్యవస్థలను తగ్గించాలన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని తీవ్రంగా విమర్శించారు. తాను, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని కోరామన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications