కాలి నొప్పి తీవ్రం: రెండు రోజులు యాత్రకు విరామం

విశాఖపట్నం జిల్లాలో ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత శృంగవరంలో చంద్రబాబు బస చేస్తారు. తిరిగి సోమవారం సాయంత్రం నాలుగున్నరకు తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆయనకు శుక్రవారం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కనీసం రెండు రోజులైన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో తెలుగుదేశం నేత గరికపాటి రామ్మోహన్‌తో పాటు మరికొంత మంది నేతలు చంద్రబాబును కలుసుకున్నారు.
అనంతరం గరికపాటి మీడియాతో మాట్లాడారు. విశ్రాంతి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడంలేదని, పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారన్నారు. విశ్రాంతి తీసుకోకపోతే కాలిగాయం ఎక్కువై ఇబ్బంది పడవలసి వస్తుందని డాక్టర్లు చెప్పారని ఆయన అన్నారు. చివరికి రెండు రోజులు పాదయాత్రకు విరామం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు.
వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కాలు నొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. కాళ్ల నొప్పులతో పాటు కండరాల నొప్పులు తీవ్రమయ్యాయి. కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు పలుమార్లు చంద్రబాబును హెచ్చరించారు. అయినా ఆయన మొండితనంతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications