ఒంటరి పోటీయే: కెసిఆర్, విజయశాంతిపై డౌట్ క్లియర్

వచ్చే ఎన్నికల్లో తాను, విజయశాంతి పోటీ చేస్తామని, గెలిచి తీరుతామని కెసిఆర్ చెప్పారు. విజయశాంతి టికెట్ ఇవ్వబోరనే ప్రచారానికి ఈ ప్రకటన ద్వారా కెసిఆర్ తెర దించారు. శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎప్పటిలాగే విజయశాంతి కెసిఆర్ పక్కన కూర్చున్నారు.
ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణకు అనుకూలంగా ఉండే విధంగా మద్దతు ఇవ్వడం గురించి ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధనే తమ ఏకైక లక్ష్యమని ఆయన చెప్పారు. అందుకు అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆలోచన చేస్తాని ఆయన చెప్పారు. మే నెలాఖరున పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు నాయని నర్సింహారెడ్డి అధ్యక్షతను కమిటీని వేసినట్లు ఆయన తెలిపారు.
తమ పార్టీ అభ్యర్థుల గురించి మీడియా ప్రదర్శించిన తీరు సరి కాదని, అభ్యర్థులను ప్రకటించారంటూ అనవసరమైన ప్రచారం సాగించిందని ఆయన అన్నారు. ఈ నెల 27వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ జరుగుతుందని ఆయన చెప్పారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 250 మంది చొప్పున ప్రతినిధులు హాజరవుతారని ఆయన చెప్పారు. దీనికి 23 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ఆయన చెప్పారు.
ఎన్నికల కమిటీ రెండు మూడు సర్వేలు నిర్వహిస్తుందని, జిల్లా నాయకత్వాల అభిప్రాయం తీసుకుంటుందని, ఆ తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని ఆయన చెప్పారు. అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వరదారెడ్డిని ఆయన పోలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు.












Click it and Unblock the Notifications