బాబుకు తిరగబెట్టిన కాలు నొప్పి: కండరాల నొప్పులు

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఆ తర్వాత విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారు. ఇంకా మరో 16 రోజులపాటు ఆయన పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన కాళ్లు, కండరాల నొప్పి తీవ్రస్థాయికి చేరింది. తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని, లేకపోతే ఈ నొప్పి శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా ఆయన వినడం లేదు.
కాగా, ప్రస్తుతం కాళ్లు, కండరాల నొప్పి భరించరాని స్థితికి చేరడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం తూర్పు గోదావరికి బయలుదేరింది. శుక్రవారం చంద్రబాబును పరీక్షించనుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా పాదయాత్రను ముందుకు కొనసాగించానని, కానీ, మూడు నెలలుగా కాలు నొప్పి తీవ్రంగా బాధిస్తోందని చంద్రబాబు చెప్పారు.
నొప్పి తగ్గాలంటే హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని డాక్టర్లు చెబుతారని వివరించారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోకపోతే కండరాల నొప్పి మరింత తీవ్రం కావడమే కాకుండా ఈ నొప్పి శాశ్వతంగా ఉండిపోతుందని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారని తెలిపారు. "మీ సమస్యలను పరిష్కరించగలిగితే చాలు.. ఈ నొప్పులు జీవితాంతం కొనసాగినా మీ కోసం భరిస్తా'' అని పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications