జస్ట్ కాజువల్!: గంటాతో భేటీపై దాడి వీరభద్ర వివరణ

Dadi Veerabhadra Rao
విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాస రావుతో తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్ర రావు శుక్రవారం తెలిపారు. తాము తరుచూ మాట్లాడుకుంటూనే ఉంటామన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని క్రాస్ రోడ్డు వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటుకు సంబంధించి తాను మంత్రిని కలిసినట్లు చెప్పారు.

ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన వివాదం కాకుండా పరిష్కారం కోసమే కలిశానన్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చూడటం తన ముందున్న ప్రధాన లక్ష్యమని దాడి ఈ సందర్భంగా చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని తాను మంత్రిని కోరినట్లు చెప్పారు.

అలాగే తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరినట్లు చెప్పారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌లో అనకాపల్లి కలయికపై కూడా చర్చించామని దాడి వీరభద్ర రావు చెప్పారని తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం దాడి వీరభద్ర రావు మంత్రి గంటా శ్రీనివాస రావుతో భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ రోజు విశాఖ జిల్లాలోకి ఎంటర్ కావాల్సి ఉంది. అయితే, ఆయన కాళ్ల నొప్పులు తిరగ బెట్టడంతో వైద్యులు పరీక్షలు జరిపి రెండు రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, బాబు పాదయాత్ర విశాఖలోకి ఎంటరయ్యే సమయంలోనే గంటతో దాడి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నా.. ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చుకోవడంతో సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+