వైయస్ రద్దు చేసిన పథకాల్ని మేం మళ్లీ తెస్తాం: కిరణ్

YS Rajasekhara Reddy - Kiran Kumar Reddy
రాజమండ్రి: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రద్దు చేసిన సంస్థని పునరుద్దరిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దళిత శంఖారావం సభలో ప్రకటించారు. వైయస్ హయాంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(ఎన్ఏస్ఎఫ్‌డిసి), నేషనలర్ ఎస్టీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్లను పునరుద్దరిస్తామని కిరణ్ చెప్పారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ నేతృత్వంలో దళిత శంఖారావం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులకు రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తామని, రక్షిత మంచినీటికి రూ.400 కోట్లు, పదో తరగతి తర్వాత చదువు కొనసాగింపునకు రూ.200 కోట్లతో 100 ఎస్సీ వసతి గృహాలు, రూ.250 కోట్లతో 250 ఎస్టీ వసతిగృహాలు ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ హాస్టళ్లలో ఆడపిల్లలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీల్లోని నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి ఏర్పాటైన 'ఎన్ఎస్ఎఫ్‌డీసీ'(జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి సంస్థ)ని రాష్ట్రంలో వైయస్ ప్రభుత్వం రద్దు చేసిందని దాన్ని పునరుద్ధరించి 2.60లక్షల మందికి లబ్ధి కల్పిస్తామని చెప్పారు.

అలాగే వీరికి రూ.1,150 కోట్ల సబ్సిడీని, బ్యాంకుల నుంచి మరింత రుణాన్ని ఇప్పించనున్నట్టు చెప్పిన ఆయన ఈ పథకానికి ఇంకా పేరు పెట్టలేదని చెప్పారు. విదేశాల్లో చదివే వి ద్యార్థులకు రూ.10లక్షల గ్రాంట్ ఇస్తామన్నారు. విదేశీ అర్హత పొందడానికి అవసరమైన పరీక్షల కోసం ఈ ఏడాది 5వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని, కనీసం 500 మంది విదేశాలు వెళతారని ఆశతో ఉన్నామని చెప్పారు.

ఇందిరా గాంధీ 1975-76లో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కోసం కలలు కన్నారని, ఇప్పటికి ఆ కలలు నెరవేరుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాల్సి ఉన్నదని హర్ష కుమార్ అభిప్రాయపడ్డారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా తయారవ్వడానికి ఉపయోగపడే ఎన్ఎస్ఎఫ్‌డిసిని వైయస్ రద్దు చేశారని మండిపడ్డారు. 'ఐఎవై' పథకంలో 62శాతం ఇళ్లు దళితులకు కేటాయించవలసి ఉన్నా ఇందిరమ్మ పథకంతో వారికి వైయస్ ఇళ్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని దళిత బంధు బిరుదుతో సత్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+