జగన్ బయటకు రాడు: కోట్ల, అప్పుడే చెప్పా: శంకరన్న

Shankar Rao - Kotla Suryaprakash Reddy
కర్నూలు/కరీంనగర్: అక్రమాస్తుల కేసులో అరెస్టై ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు బయటకు రాడని కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలులో ఆదివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ త్వరలో కాంగ్రెసు పార్టీలో విలీనం కాక తప్పదన్నారు. గాజు దిన్నె ఎత్తిపోతల పథకం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

వైయస్ వైఖరి నాడే తప్పు పట్టా.. శంకర రావు

బయ్యారం గనుల కేటాయింపు విషయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని తాను అప్పుడే తప్పు పట్టానని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు కరీంనగర్ జిల్లాలో అన్నారు. బయ్యారం గనుల కేటాయింపు తప్పన్నారు. దళిత ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు హోంశాఖ బాధ్యతలు అప్పగించాలన్నారు.

దళిత నేతకు హోంశాఖను ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు. అవినీతి పైన తాను పోరాడం చేస్తున్నందుకే ముఖ్యమంత్రి తనను మంత్రిగా తప్పించారని, తప్పుడు కేసులు పెట్టించారని శంకర రావు ఆరోపించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్న ముఖ్యమంత్రి మాటలతో కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకుకు తెలంగాణలో గండి పడనుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+