మనసులు కలిపిన చాటింగ్: పెళ్లైన తెల్లారే విడిపోయారు

సీమ తన కుటుంబ సభ్యులతో బికనీర్‌లోనే ఉంటోంది. ఇద్దరూ సామాజిక నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ద్వారా రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. వారి పరిచయం నెలల క్రితం జరిగింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈనెల 26న ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.
అంతలోనే ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. సీమ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు వరుడు శంకర్ లాల్‌పై అత్యాచారం కేసు పెడతామని బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అతడు సీమ, ఆమె కుటుంబ సభ్యులు తనను మోసగించారంటూ డూంగేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.
అయితే, ఉభయ వర్గాలు రాజీకి రావడంతో అతడు 27న కేసు ఉపసంహరించుకున్నాడని పోలీస్ స్టేషన్ అధికారి దినేశ్ మీనా తెలిపారు. తమ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వారిద్దరూ తమకు లిఖిత పూర్వకంగా తెలిపారని చెప్పారు. దీంతో వివాదం సమసిపోయింది.












Click it and Unblock the Notifications