కీచకపర్వం: మూడు రోజులు గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్

అనంతరం అతనితో పాటు మరో ఇద్దరు ఆటోడ్రైవర్లు వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు ఆమెను అదే గదిలో నిర్బంధించారు. ఆ బాలిక ఆచూకి లభ్యం కాకపోవడంతో ఆమె బంధువులు ఆరా తీస్తుండగా ఈ వ్యవహారం బయటకు పొక్కింది. దీంతో సదరు బాలికను నిర్బంధించిన గదికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి రంపచోడవరం పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. తనపై అత్యాచారానికి పాల్పడిన వారి వివరాలను పోలీసులకు వెల్లడించింది.
రంపచోడవరానికి చెందిన స్వామి, నాని, కిరణ్ అనే ఆటోడ్రైవర్లు తనను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. బాలిక ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని ఆమెను వైద్యసేవల నిమిత్తం రంపచోడవం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాదులో బాలికపై అత్యాచారం
హైదరాబాదులో బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిషన్‌బాగ్‌కు చెందిన సయ్యద్ మతీన్ కుమారుడు సయ్యద్ షేర్ (20) తరచూ భవానీనగర్‌లోని బంధువుల ఇంటికొచ్చేవాడు. అలాగే ఏప్రిల్ 30న కూడా వచ్చాడు. పక్క ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడం గమనించాడు. వెంటనే ఆ ఇంట్లోకి చొరబడి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు బాలిక మౌనంగా ఉండటం గమనించి విషయం ఏమిటని అడిగారు. షేర్ తనపై అత్యాచారం చేశాడని బాలిక చెప్పడంతో కుటుంబసభ్యులు భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం సయ్యద్‌షేర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
ప్రకాశం జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని పుల్లాయిపాలెంలో గురువారం ఓ యువకుడు పదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రోజు మాదిరిగానే అమ్మాయి తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. దాంతో అమ్మాయి పక్కింటిలో ఆడుకోవడానికి వెళ్లింది. ఇంటి యజమాని సాంబయ్య (30) మాయమాటలు చెప్పి అమ్మాయిని తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. దేహశుద్ధి చేసి సాంబయ్యను గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications