జగన్ వైపు జంప్: బాబు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని దాడి!

Chandrababu Naidu - Dadi Veerabhadra Rao
హైదరాబాద్: నిన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విశాఖపట్నం సీనియర్ రాజకీయ నాయుకుడు దాడి వీరభద్ర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినా తీయలేదట. ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారు. జగన్ పార్టీలో చేరాలన్న దాడి నిర్ణయం నిస్పృహతో తీసుకొన్నదని, ఒకే ఒక్క నిర్ణయం మొత్తం ముప్పై ఏళ్ల రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తుందని, అంతకు ముందు విషయాలేవీ ఎవరూ అడగరని అభిప్రాయపడ్డారు.

ఈ నిర్ణయంలోని మంచి చెడ్డలే చర్చ అవుతాయని, తాము ఆయనకు తక్కువేమీ చేయలేదని, ఆరేళ్లపాటు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చామని, ఇంకోసారి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయనకు అదే చెప్పామని, మరో అవకాశం ఏదో ఒకటి తప్పక ఇస్తానని హామీ ఇచ్చానని, దాడి తన కుటుంబంతో సహా వచ్చి తనను కలిశారని, ఆయన కుమారుడితో మాట్లాడానని, చివర్లో వేరే ఆలోచనతో ఉన్నారని తెలిసినప్పుడు స్వయంగా ఫోన్ చేశానని, కానీ తన ఫోన్ కూడా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాయకుల్లో స్వార్థం, అభద్రతా భావం పెరిగిపోతున్నాయని, దాని ఫలితమే ఈ పరిణామాలు అన్నారు. నాయకులు ఎలా ఉన్నా తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం నిస్వార్థంగా పార్టీని కాపాడుకొంటున్నారని, జెండాను భుజాన వేసుకొని పార్టీని వారే నిలబెడుతున్నారని ఆయన ప్రశంసించారు. అనకాపల్లి నియోజకవర్గంలో గత పాతికేళ్లుగా ఒక్క దాడి కుటుంబానికే అవకాశం ఇచ్చామని, ఆయన మరొకరిని ముందుకు రానివ్వలేదని, అయినా ఆయన వెళ్లిపోయారన్నారు. ఆ నియోజకవర్గంలో 95 శాతం కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారన్నారు.

విశాఖ జిల్లాలోనే ఉన్న పాయకరావుపేటలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు వెళ్లిపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తరఫున ఎన్నికల ఏజెంటుగా వ్యవహరించిన నేత కూడా ఆయనతోపాటు వెళ్లలేదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి అన్నారు. నాయకులు వెళ్లిపోయినా పార్టీ చెక్కు చెదరలేదన్నారు. తెలంగాణలో తెరాస నుంచి టిడిపిలోకిఇంకా వలసలు ఉన్నాయా అని ప్రశ్నించగా... గేట్లు తీస్తే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+