'రేపు జగన్‌కు బెయిల్: శంకర్రావుని పార్టీలోకి తీసుకోం'

కోర్టులపై గౌరవం ఉన్న ఆశావాదులమని, జగన్‌కు 6న బెయిల్ వస్తుందని, రావాలని కోరుకుంటున్నామని, అది తమ విశ్వాస స్థాయి అన్నారు. జగన్‌ను జైలులో పెట్టి 11 నెలలు అయిపోయిందని, వాస్తవానికి 90 రోజుల తర్వాతే బెయిల్ ఇవ్వాల్సి ఉందన్నారు. జగన్ కనుసైగ చేస్తే ప్రభుత్వం పడిపోతుందని అంటున్నారని, కానీ వైఎస్ రెక్కల కష్టంమీద వచ్చిన ఈ ప్రభుత్వాన్ని కూల్చబోమని జగన్ ఇదివరకే చెప్పారని గుర్తుచేశారు.
తమ పార్టీలో చేరుతున్న వారిని తిట్టించటం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తగదని హితవు పలికారు. గేట్లు తెరవటం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన గేట్లు తెరిస్తే వాళ్ల పార్టీలోకి వచ్చే వాళ్లు ఉండరన్నారు. కొండ మీద ఉన్నారా? లోయలో ఉన్నారా? అనేది చూసుకోవాలని, తమ పార్టీలోకి వచ్చే వారిని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ పార్టీలోకి వస్తున్న వారు పదవుల కోసం వచ్చిన వారు కాదని, ప్రజా సేవ కోసమే వస్తున్నారని చెప్పారు.
అయితే వారు ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ తరఫున మాట్లాడుతారని అనుకోవట్లేదన్నారు. సుదీర్ఘమైన అనుభవంతో వస్తున్న దాడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి శంకర రావు వస్తానంటే పార్టీలోకి తీసుకోమన్నారు. కొత్తగా ఎవరు వచ్చినా పార్టీలో చర్చ, క్షేత్ర పరిశీలన ఉంటుందని, అది లేకుండా చేరికలు ఉండవని చెప్పారు. మోసగాళ్లు వస్తామంటే పార్టీలో చేర్చుకోబోమని, వారి ట్రాక్ రికార్డు పరిశీలిస్తామని, పార్టీకి ఎంతవరకు అవసరమో చూస్తామన్నారు.












Click it and Unblock the Notifications