హీరో రామ్ చరణ్ హల్‌చల్: ఇద్దరిపై దాడి చేసిన గార్డ్స్

తన కారును ఢీకొట్టాడనే కారణంతో రామ్ చరణ్ ఆ ఇద్దరిపై చేయి చేసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. రామ్ చరణ్‌తో పాటు వారిపై అంగరక్షకులు చేయి చేసుకున్నారని, అప్పుడు రామ్ చరణ్ వారిని అడ్డుకోలేదని చెబుతున్నారు. జివికె మాల్ సమీపంలోని తాజ్ డెక్కన్ హోటల్ వద్ద ఈ ఘటన జరిగింది.
రామ్ చరణ్ తేజకు బాధితులు సైడ్ ఇవ్వక పోవడం వల్లనే వారి కారును ఓవర్ టేక్ చేసిన చెర్రీ వారితో వాగ్వాదానికి దిగాడని, ఆ తర్వాత తన వ్యక్తిగత సిబ్బందిని పిలిపించి దాడికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు.
ఈ ఘటనపై బాధితులు ముందుగా పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెబుతూ పోలీసులు వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు పంపించారు. బాధితులు పోలీసు స్టేషన్‍లో చెర్రీ, ఆయన అంగరక్షకుల పైన ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications