గేమ్‌ప్లాన్‌లో బాబు విలవిల: పురంధేశ్వరికి ఎంపీల చెక్

పార్టీ అధ్యక్షుడిగా స్పీకర్ నుండి ఆహ్వానం రాలేదు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇదంతా కేంద్ర పర్యటక శాఖ మంత్రి పురందేశ్వరి గేమ్ ప్లాన్ అంటున్నారు. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పురంధేశ్వరి చూస్తున్నారని అంటున్నారు. ఈ విగ్రహావిష్కరణకు బాబు వెళ్లకుంటే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానం ఎవరి నుండి అందినా వెళ్లాల్సి ఉంటుందని ఇతరులు చెబుతున్నారు. కానీ, బాబు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారట.
పురంధేశ్వరికి కాంగ్రెసు ఎంపీలు చెక్!
మరోవైపు పురంధేశ్వరి దూకుడుకు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకు వెళ్లవద్దంటూ కాంగ్రెసు పార్టీ ఎంపీలు సాయి ప్రతాప్, కావూరి సాంబశివ రావు, అనంత వెంకట్రామి రెడ్డిలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. విగ్రహావిష్కరణకు సోనియాకు వద్దని చెప్పి కాంగ్రెసు పార్టీ కొత్త వాదనకు తెరలేపింది.
దీనిపై సోనియా గాంధీ ఆఖరి నిమిషంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే, ఎంపీల మాట వింటే పురంధేశ్వరి దూకుడుకు చెక్ పడినట్లేనని భావించవచ్చు. అలాగే సోనియా ఎంపీల మాటను బేఖాతరు కూడా చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications