జగన్‌కు ఝలక్: బొత్సతో కొణతాల రహస్య భేటీ?

Botsa Satyanarayana - Konathala Ramakrishna
విశాఖపట్నం: జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్ర రావు రాకతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత కొణతాల రామకృష్ణ పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం మరింత జోరందుకుంది. కొణతాల మంగళవారం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో రహస్యంగా భేటీ అయినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో సోమయాజులు కూడా పాల్గొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

బొత్స సత్యనారాయణతో కొణతాల రామకృష్ణ భేటీ కావడంతో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కొణతాల కాంగ్రెసు పార్టీలో చేరితో విశాఖలో ఆ పార్టీకి అదనపు బలమే. దాడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తే జిల్లాలో తమ ఆధిపత్యం పోతుందని కొణతాల వర్గం ఆందోళన చెందుతుంది. ఈ కారణంగానే వారు దాడి రాకను వ్యతిరేకిస్తున్నారు.

మరో పార్టీలోకి వెళదామని కార్యకర్తలు కొణతాల పైన ఒత్తిడి తీసుకు వస్తున్నారట. కొణతాల కూడా అదే ఆలోచనతో ఉన్నారట. దాడి వీరభద్ర రావును పార్టీలో చేర్చుకుంటే నష్టమని తాను తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు చెప్పానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాల రామకృష్ణ మంగళవారం అన్నారు.

ఆయనను చేర్చుకుంటే పార్టీకి నష్టమని చెప్పినా చేర్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో తన కార్యకర్తలు అంతే ముఖ్యమన్నారు. తన కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను నడుచుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+