డైలమా: టిడిపి నుంచి జంప్‌నకే కడియం మొగ్గు

శుక్రవారం కూడా ఆయన హన్మకొండలోని తన నివాసంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరికపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. తెరాసలో ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యవహారశైలి మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన తర్వాత పట్టించుకోకుండా అవమానాలకు గురిచేసే అవకాశం లేకపోలేదనే భయం వెంటాడుతున్నట్లు చెబుతున్నారు.
మెజారిటీ నేతలు మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణవాదం వైపు నిలబడటంలో తప్పు లేదని తేల్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులోనూ తెలంగాణకు అనుకూలంగా స్పష్టంగా నిలబడే అవకాశం లేదని, ప్రజలు తెలంగాణవైపు నిలబడడం వల్ల వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి ఓటమి తప్పదని నేతలు విశ్లేషించినట్లు చెబుతున్నారు.
పార్టీ మారినా సొంత స్థానం స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌నే అడగాలని పలువురు నేతలు సూచించినట్లు తెలిసింది. తెరాస నేతలు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామన్నా వద్దని చెప్పాలన్నారు. వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పినా అంగీకరించ వద్దన్నట్లు సమాచారం. చేసిన అభివృద్ధితో పాటు తెలంగాణ వాదం అండగా ఉంటే స్టేషన్ ఘన్‌పూర్‌లో గెలుపు సులభమవుతుందని నచ్చచెప్పినట్లు తెలిసింది.
పార్టీ వీడేది లేదు: శ్రీహరి
ముఖ్య అనుచరులతో సమావేశం విషయమై కడియం శ్రీహరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని దానికి రాజకీయ ప్రాధాన్యం లేదని కొట్టిపారేశారు. తాను టీడీపీని వీడేది లేదని శ్రీహరి స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications