జగన్ కేసులో ట్విస్ట్: నమ్మకద్రోహం అభియోగం కొట్టివేత

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. జగన్, విజయసాయిరెడ్డిలపై సిబిఐ మోపిన అభియోగాన్ని సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. నమ్మకద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. ఐపియస్ 409 సెక్షన్ జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి వర్తించదని కోర్టు తెలిపింది. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో మోపిన ఈ అభియోగాలను మాత్రమే కోర్టు తోసిపుచ్చింది.

దానికి ముందు దాఖలు చేసిన చార్జిషీట్లలో జగన్, విజయసాయిరెడ్డిలపై ఆ అభియోగాలు అలాగే ఉన్నాయి. సెక్షన్ 409 నమ్మకద్రోహం కిందికి వస్తుంది. అలాగే, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు కింద నమోదు చేసిన అభియోగాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. ప్రజాప్రతినిధులుగా ఉండి ఇతరులను ప్రభావితం చేసిన నేరానికి ఆ సెక్షన్ కింద అభియోగం మోపుతారు.

పిసీ యాక్ట్ సెక్షన్ 12 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వాధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ మీద మోపిన అభియోగాన్ని మాత్రం కోర్టు తోసిపుచ్చలేదు. ఆ అభియోగాలను కోర్టు తోసిపుచ్చడం వల్ల జగన్‌కు కొంత ఊరట లభిస్తుందని అంటున్నారు.

మిగతా నాలుగు చార్జిషీట్లలో మోపిన అభియోగాలపై జగన్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా నాలుగు చార్జిషీట్లలో ఆ సెక్షన్ల కింద మోపిన అభియోగాలను కూడా తోసిపుచ్చాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామం వైయస్ జగన్ ఆస్తుల కేసులో కీలకమైన మలుపుగానే భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+