కొణతాల 'దాడి': వైయస్ జగన్‌కు కొడాలి నాని ఝలక్?

కొణతాల అభ్యంతరాలను లెక్క చేయకుండా వైయస్ జగన్ దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో కొణతాలకు, దాడికి మధ్య చాలా కాలంగా వైరం సాగుతోంది. తాను కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని దాడి వీరభద్రరావు ఇటీవల విశాఖపట్నంలో ప్రకటించారు. అయినా కొణతాల రామకృష్ణ అందుకు ముందుకు రావడం లేదు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చిన కృష్ణా జిల్లా గుడివాడ శానససభ్యుడదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఝలక్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్ జగన్ వైపు చేరి, విప్‌ను ధిక్కరించిన మిగతా తెలుగుదేశం శాసనసభ్యులు మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణకు హాజరు కాలేదు. తమపై వేటు వేయాలని వారు కోరారు. తెలంగాణకు చెందిన వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి మాత్రం విచారణకు హాజరయ్యారు.
విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని కొడాలి నాని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు ఓ లేఖ రాశారు. దీంతో ఆయన జగన్‌కు ఝలక్ ఇస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వ్యూహంలో భాగంగా కొడాలి నాని ఆ విజ్ఞప్తి చేశారనే మాట కూడా వినిపిస్తోంది. ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే అలా చేసి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications