ఉచిత శిక్షణ: ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది.
ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ మిట్టోస్ సచివాలయంలో మంగళవారంనాడు పరస్పరం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థకు 20 ఎకరాల భూమిని అందించింది. ఐదు వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తొలుత 20 ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన దాదాపు 30 వేల మంది విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ ఇస్తారని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.
దేశంలోనే ప్రప్రథమంగా గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విధమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ మిట్టోస్ చెప్పారు.












Click it and Unblock the Notifications