ఎంత పనిచేశావమ్మా: కొండా సురేఖతో వైయస్ జగన్

ఏం చేస్తారని వైయస్ జగన్ అడిగితే ప్రాణాలైనా ఇస్తా అని కొండా మురళి అన్నట్లు తెలిసింది. ప్రాణాలు అక్కర్లేదు గానీ కలిసి పనిచేద్దామని, కలిసి పనిచేస్తే చాలునని జగన్ అన్నట్లు తెలుస్తోంది. "తోబుట్టువులా చూసుకున్నా, నువ్వే ఇలా చేస్తే ఎలా?" అని జగన్ కొండా సురేఖతో అన్నట్లు చెబుతున్నారు. "లీకులు ఇవ్వడం సరైందని అనుకుంటున్నావు, ఎవరికి మేలు చేయాలనుకున్నావు?" అని ఆయన అడిగినట్లు చెబుతున్నారు.
"ఏమైనా ఉంటే తనకు చెప్పాలి గానీ నువ్వే ఇలా చేస్తే ఎలా?" అని జగన్ సురేఖను అడిగినట్లు తెలిసింది. "కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నానని, అక్కగా ఎలా ఉండాలో తెలియదా" అని జగన్ అడిగినట్లు తెలిసింది. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమతో మాట్లాడారంటూ కొండా మురళి మీడియాకు కొండా మురళి లీకు ఇచ్చారని, దాన్నే జగన్ ప్రశ్నించారని అంటున్నారు.
గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొండా దంపతుల వ్యవహారం నలుగుతున్న విషయం తెలిసిందే. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే కోపంతో వారు అలక వహించారు. తమ వర్గానికి చెందిన నలుగురిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం వేటు వేయడంతో వారు మరింత బిగుసుకున్నారు. దీంతో వారితో చర్చల కోసం శానససభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డిని నియోగించారు. బాలినేని శ్రీనివాస రెడ్డి గత కొద్దిరోజులుగా కొండా దంపతులతో చర్చలు జరిపారు.
సోమవారం సాయంత్రం వైయస్ విజయమ్మతో సమావేశమైన కొండా దంపతులు మంగళవారం మధ్యాహ్నం వైయస్ జగన్‌తో చంచల్‌గుడా జైలులో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొండా దంపతుల తీరు పట్ల జగన్ కాస్తా ఆవేదనతో మాట్లాడినట్లు చెబుతున్నారు. జగన్‌తో చర్చల తర్వాత తాము వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉంటామని కొండా దంపతులు చెప్పారు.












Click it and Unblock the Notifications