బయ్యారం దోపిడీకి జగన్ కుట్ర, షర్మిల యాత్ర: ఆనం

రాష్ట్రాన్ని దోపిడీ చేసి జైలులో ఊచలు లెక్క పెట్టుకుంటున్న జనగ్ పేరు చెప్పుకుని ఊళ్లోకి వచ్చే నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో జరిగిన డివిజన్ స్థాయి రైతు సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసుపై విరుచుకుపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే పేదలు తినే తిండిని, కట్టుకునే బట్టలను కూడా దోచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో ప్రజా జీవన పేరుతో వస్తున్న ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని ఆయన సూచించారు. కొన్ని త్యాగాలు చేయడం వల్లనే గత ఏడు దశాబ్దాలుగా తమ వర్గీయులు మంత్రులుగా, శానససభ్యులుగా కొనసాగుతున్నారని చెప్పారు. జిల్లాలో ప్రాజెక్లులను సాధించిన ఘనత ఆనం కుటుంబ సభ్యులదేనని ఆయన అన్నారు.
తన మంత్రివర్గ సహచరులను కళంకిత మంత్రులని అనడం తనకు బాధాకరంగా ఉందని మంత్రి పితాని సత్యనారాయణ వేరే సందర్భంలో అన్నారు. ఆరుగురు మంత్రులు కూడా క్విడ్ ప్రోకోకు పాల్పడలేదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మంత్రులు జీవోలపై సంతకాలు చేశారని ఆయన అన్నారు. ముడుపులన్నీ జగన్ సంస్థలకే వెళ్లాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications