మద్యం తాగించి యువతిపై అత్యాచారం చేశారు

ఈ గ్యాంగ్ రేప్ వివరాలు ఇలా ఉన్నాయి - ముషీరాబాద్ రాంనగర్ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన 18 యేళ్ళ యువతిపై అదే ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు కన్నేసి ప్రేమిస్తున్నట్టు నమ్మబలికాడు. ఆ తర్వాత ఏప్రిల్ 17వ తేదీన నగర శివారు ప్రాంతానికి యువతిని తీసుకుని వచ్చి తొలుత అత్యాచారం చేశాడు.
ఈ నెల 7వ తేదీన తన స్నేహితులు నిఖిల్, అరుణ్‌తో కలిసి ఆటోలో యువతిని బంజారాహిల్స్‌లోని ఓ ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 9న తిరిగి వారు ముగ్గురు మరో వ్యక్తితో కలిసి ఆటోలో ఆమెను హుస్సేన్‌సాగర్‌కు తీసుకొచ్చి ఇదే విధంగా అగాయిత్యానికి పాల్పడాలని భావించారు. హుస్సేన్‌సాగర్‌లో ఆమెను తోసేద్దామని ఆ తర్వాత విరమించుకున్నారు.
దీంతో బాధితురాలు తన పరిస్థితిని తన సోదరికి చెప్పడంతో ఆమె ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు యువకుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications