వైవాహికేతర సంబంధం: లవర్‌ను హత్య చేసిన వ్యక్తి

Murder
అనంతపురం: అనంతపురం జిల్లా పరిగి ఎస్సీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వైవాహికేతర సంబంధం బెడిసి కొట్టింది. లక్ష్మమ్మ అనే మహిళను ప్రియుడు భీమప్ప కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత తనను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భర్తను వదిలేసి లక్ష్మమ్మ పరిగిలో నివాసం ఉంటోంది. భీమప్పతో సహజీవనం చేస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగినట్లు సమాచారం. దీంతో ఆగ్రహంతో భీమప్ప లక్ష్మమ్మను కత్తితో నరికి చంపాడు. అనుమానంతోనే లక్ష్మమ్మను అతను నరికి చంపినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, హైదరాబాదులోని ఆసిఫ్‌నగర్ ఎసిపి కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడితో ఉన్న ప్రేమ వ్యవహారం విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో ఆమె ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం కేశపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఏడేళ్ల బాలుడిపై 30ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. గాయాలపాలైన బాలుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బీహార్‌కు చెందిన నిందితుడు దూబేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+