నాటు తుపాకి బెదిరించి ఎంటిఎం సెంటర్ల చోరీకి యత్నం

ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి మణికొండలోని కరూర్ వైశ్యా బ్యాంక్ ఎంటిఎం సెంటర్‌లోకి ప్రవేశించారు. సిసి కెమెరా, స్మోకింగ్ అలారం తీగెలను కత్తిరించేందుకు ప్రయత్నించారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును నాటు తుపాకితో బెదిరించారు.
మరో ఇద్దరు వ్యక్తులు లోనికి ప్రవేశించి గ్యాస్ కట్టర్‌తో ఎంటిఎంను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. షేక్‌పేటలోని హెచ్‌డిఎఫ్‌సి ఎంటిఎం సెంటర్‌లోని మూడు ఎంటిఎంలను ఇదే విధంగా బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు.
అయితే, రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీసులు అనుకోకుండా చేరుకోవడంతో దుండగులు పారిపోయారు. పోలీసులు సెక్యూరిటీ గార్డు నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications