యెరవాడ జైల్లో లొంగిపోతా: సంజయ్ దత్ విజ్ఞప్తి

సంజయ్ దత్ దరఖాస్తుపై విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున, సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ సాల్వి కోర్టుకు హాజరయ్యారు. లొంగిపోవడానికి మరింత గడువు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన వెంటనే సంజయ్ దత్ టాడా కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ 42 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది.
1993 ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవించడానికి లొంగిపోయేందుకు మరింత గడువును ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సంజయ్ దత్‌తో సినిమా తీస్తున్న ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలు పూర్తి చేసుకోవడానికి వీలుగా లొంగిపోయేందుకు సంజయ్ దత్‌కు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సంజయ్ దత్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. 1993 వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు మే 10వ తేదీన సంజయ్ దత్ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఇతర ఆరుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications