వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా రాజకీయ జీవితం టిడిపితోనే: ఎర్రబెల్లి, కెసిఆర్‌పై ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందని ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కడియం శ్రీహరి తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావును పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రయత్నిస్తుందని వచ్చిన వార్తలపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టత ఇచ్చారు. తాను, పార్టీ కడియం శ్రీహరికి ఆసరా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

బయ్యారం విషయంలో కెసిఆర్‌పై ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వర రావు కెసిఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ స్టీల్స్‌ను రక్షించింది కెసిఆరేనని వారు ఆరోపించారు. గనులపై పార్లమెంటులో చర్చ జరగుతుంటే కెసిఆర్ ఎందుకు రాలేదని వారు అడిగారు. కెసిఆర్‌కు ఎంపి పదవి కావాలి గానీ పార్లమెంటుకు హాజరు కారని వారు వ్యాఖ్యానించారు. కెసిఆర్ వల్లనే తెలంగాణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. బయ్యారంపై కెసిఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.

బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలన్నది తమ పార్టీ డిమాండ్ అని వారన్నారు. బయ్యారం అంశంపై అఖిల పక్ష సమావేశం పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేసే వరకు తాము పోరాటం సాగిస్తామని వారు చెప్పారు. బయ్యారం వ్యవహారంపై ఈ నెల 17వ తేదీన గవర్నర్‌ను కలుస్తామని వారు చెప్పారు.

తమ పార్టీ పోరాటం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బయ్యారం గనుల కేటాయింపు రద్దయిందని వారు చెప్పుకున్నారు. విశాఖ స్టీల్స్‌కు, రక్షణ స్టీల్స్‌కు పనికి వచ్చే ముడి ఇనుము ఉక్కు కర్మాగారం పెట్టడానికి పనికి రాదా అని వారు అడిగారు. బయ్యారంపై ఉద్యమిస్తోందని తమ పార్టీ మాత్రమేనని వారన్నారు.

English summary
The Telugudesam party Telanagana forum convenor Errabelli Dayakar Rao said that his political life is linked with TDP. He lashed out at the Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) on Bayyaram issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X