జూ.ఎన్టీఆర్ రగడ: హరికృష్ణని పక్కన పెట్టిన చంద్రబాబు

Chandrababu Naidu - Harikrishna - Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది అయిన నందమూరి హరికృష్ణను పక్కన పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో బాబు తనయుడు నారా లోకేష్, హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య ఆధిపత్య పోరు సాగిన విషయం తెలిసిందే. జూనియర్‌కు అండగా నిలిచిన హరికృష్ణ ఇటీవల విశాఖపట్నంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సభకు హాజరు కాలేదు.

బాబు తర్వాత టిడిపి పగ్గాలు జూనియర్‌కు అందాలని హరి పట్టుదలగా ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు, హరిల మధ్య దూరం మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. విశాఖ సభకు హరి హాజరుకాకపోగా.. ఇటీవల గవర్నర్‌ను కలిసే కార్యక్రమానికి టిడిపి హరికృష్ణను ఆహ్వానించలేదట. మంత్రివర్గంలోని కళంకిత మంత్రులను తొలగించాలని చంద్రబాబు నేతృత్వంలో ఇటీవల పలువురు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను పిలిచిన టిడిపి హరిని మాత్రం విస్మరించిందట. దీంతో ఎన్టీఆర్ వారసుడికి పొమ్మనలేక పొగ పెడుతున్నారా? అనే చర్చ సాగుతోంది. అవినీతిపై పోరాడటంలో హరికృష్ణ లేడనే మెసేజ్ పంపడానికి కూడా టిడిపి ఇలా చేసి ఉంటుందంటున్నారు.

హరికృష్ణను పిలవకపోవడం ఆయన వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోందట. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, ఒకరోజు ముందే నిర్ణయించారని, అయినా హరికి సమాచారమివ్వలేదట. విశాఖ సభకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని టిడిపి హరికి ఆహ్వానం అందించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జూనియర్ తన దుబాయ్ పర్యటనను కుదించుకొని మరీ పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+