ఫిక్సింగ్ గుట్టు రట్టు: 15 పరుగులకు రూ. 60 లక్షలు

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు బౌలర్లు ఫిక్సింగ్‌కు పాల్పడిన దృశ్యాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు. ముంబైతో బుధవారం జరిగిన మ్యాచులో అంకిత్ చవాన్ 15 పరుగులు ఇవ్వడానికి 60 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ తన బృందంతో కలిసి ఫిక్సింగ్ వివరాలను వెల్లడించారు. ఫిక్సింగ్ అయిన మ్యాచుల్లోని దృశ్యాలను మీడియా ప్రతినిధులకు చూపించారు.

తాము ముగ్గురు క్రికెటర్లను, 11 మంది బుకీలను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుకీలకు సైగల ద్వారా తాము ఎన్ని పరుగులు ఇస్తామనే విషయాన్ని అటగాళ్లు చెప్పేవారని నీరజ్ కుమార్ వివరించారు. ఏం చేస్తామనే విషయాన్ని బుకీలకు తెలియజేయడానికి కొన్ని సంకేతాలను ముందే నిర్ణయించుకుని, ఆ మేరకు మైదానం నుంచి సంకేతాలు ఇస్తూ వెళ్లారు. చొక్కా నుంచి లాకెట్ తీయడం, చొక్కాలను, వెస్ట్‌లను తీసేయడం, టవెల్ ట్రౌజర్స్‌లో పెట్టుకోవడం - ఇలాంటి సంకేతాలను క్రికెటర్లు నిర్దేశించుకున్నారు.

S Sreesanth

పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి - మే 5వ తేదీన పూణే వారియర్స్, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య జరిగిన మ్యాచులో ఫిక్సింగ్‌కు సంబంధించిన మొదటి సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండో విడత బౌలింగులో అజిత్ చండిల 14 పరుగులు ఇచ్చాడు. దానికి ముందు చండిల సైగ చేయడం మరిచిపోయాడు. దీంతో బుక్కీలు బెట్ కట్టలేకపోయారు. అది వివాదానికి దారి తీసింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని బుకీలు డిమాండ్ చేశారు. అడ్వాన్స్‌గా చండిలకు 20 లక్షల రూపాయలు ఇచ్చారు.

మొహాలీలో మే 9వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌కు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మధ్య జరిగిన మ్యాచులో స్పాట్ ఫిక్సింగ్ జరిగింది. తన ప్యాంటులో టవల్ పెట్టుకోవడం ద్వారా శ్రీశాంత్ బుకీలకు సంకేతాలు ఇవ్వాలి. బుక్కీలకు సమయం ఇవ్వడానికి వార్మప్ చేశాడు. 13 పరుగులు ఇచ్చాడు. తన బౌలింగులోని రెండో ఓవరులో 14, ఆపై పరుగులు ఇవ్వాలనే విషయాన్ని ఎక్కడ నిర్మయిచారో చెప్పడానికి కాల్ రికార్డులున్నాయి.

మూడో ఫిక్సింగ్ బుదవారం రాత్రి ముంబై ఇండియన్స్‌కు, రాజస్థాన్ రాయల్స్‌కు మధ్య జరిగిన మ్యాచులో చోటు చేసుకుంది. అంకిత్ చవాన్ తన రెండో ఓవరులో 14 లేదా ఆపై పరుగులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు 60 లక్షల రూపాయలు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. ఈ మ్యాచులో అజిత్ చండిల ఆడలేదు. దీంతో అంకిత్ చవాన్‌కు, బుకీలకు మధ్య సమాచారం అందించే పని చేశాడు.

అంకిత చండిల పరుగులు ఇచ్చిన తర్వాత బుక్కీకి, అజిత్ చండిలకు మధ్య సంభాషణ జరిగింది. బుక్కీలు ఇచ్చే డబ్బులో అంకిత్ చవాన్‌కు ఎంత, చండిలకు ఎంత ముట్టాలనేది ఆ సంభాషణ. ఈ కేసును తాము ఏప్రిల్ నుంచి ట్రాక్ చేస్తున్నాని, ముగ్గురు ఆటగాళ్లు తామ రాడార్ పరిధిలోకి వచ్చారని పోలీసులు చెప్పారు. మరింత మంది బుక్కీలను అరెస్టు చేసే అవకాశం ఉందని, క్రికెటర్ల అరెస్టులు ఉండవని నీరజ్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+