ఐపిఎల్ ఫిక్సింగ్: శ్రీశాంత్ మరో ఇద్దరు అరెస్ట్, సస్పెన్షన్

శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నారు. ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ పోలీసులు హోటల్ నారీమన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వాంఖేడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ జరిగిన అనంతరం రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు హోటల్‌కు చేరుకున్నారు. అక్కడే వారిని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించారు. ఫోన్ సంభాషణల ఆధారంగా వారిని అరెస్టు చేశారు.
ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లుగా ఫోన్ సంభాషణలను బట్టి అర్థమవుతోందని, ఏ మ్యాచులలో జరిగిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో మరో ముగ్గురు బూకీలను కూడా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు బూకీల కోసం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, 27 ఏళ్ల అజిత్ చండీలా రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆల్ రౌండర్. ఇతనిది హర్యానా. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాట్సుమెన్ అయిన అంకిత్ చవాన్ వయస్సు 27 ఏళ్లు. ఇతను ముంబయికి చెందినవాడు.
శ్రీశాంత్ భవిష్యత్తుకు దెబ్బ
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన శ్రీశాంత్ భవిష్యత్తు ఇప్పుడు ఆందోళనకరంగా మారిందని క్రీడాపండితులు చెబుతున్నారు. అంకిత్, అజిత్‌లను పక్కన పెడితే అంతర్జాతీయ మ్యాచులు ఆడిన శ్రీశాంత్ ప్రలోభాలకు లొంగడం అది ఆయనకు దెబ్బే అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ తన కెరీర్‌ను ప్రభావితం చేస్తుందని తెలిసి ఇలా చేయడం బాధాకరమన్నారు. మరోవైపు ఫిక్సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బిసిసిఐ శ్రీశాంత్‌తో పాటు ఇద్దరిని సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications