చిరును సిఎం చేయాలనే, కుల బలంతో శాసించాం: సిఆర్

CR says he wants to see Chiru as CM
హైదరాబాద్: కేంద్ర మంత్రి, సినీనటుడు చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన, ఆశ ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని ఆయన అన్నారు. కాపులు ఇతర వర్గాలతో కలిసి బలమైన శక్తిగా అవతరించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాపులు కీలకపాత్ర వహిస్తారని మంత్రి చెప్పారు. పదవులు ఆశించినంత మాత్రాన కాపులు ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కుల బలంతో ముఖ్యమంత్రి వంటి పెద్దవారినే శాసించే స్థాయికి ఎదిగామని ఆయన చెప్పారు

గురువారం ఫ్యాప్సీలో జరిగిన ఐక్యకాపునాడు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కన్నబాబు, తోట త్రిమూర్తులు, బండారు సత్యానందం, కాపునాడు సీనియర్ నేతలు మిరియాల వెంకట్రావు, పిళ్లా వెంకటేశ్వరరావు, మిరియాల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో కాపులు బలమైనశక్తిగా అవతరించాలంటే అన్ని వర్గాలను కలుపుకుని పోవాలన్నారు. రాష్ట్రంలో అసంఖ్యాకంగా ఉన్న కాపు సామాజికవర్గంపై కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే సమయంలో తాను, చిరంజీవి 40 నిమిషాల పాటు సోనియాతో మాట్లాడామని, కాపులను బిసీల్లో చేర్చాలని కోరామని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి చిరంజీవి ఆ విషయాలు బయటకు చెప్పుకోలేరని ఆయన అన్నారు.

కులముద్రను బహిరంగంగా వేసుకున్న ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం నాశనమైందని, తమకు కులం అంటే అభిమానం ఉందని, జిల్లా మంత్రులూ ఎమ్మెల్యేల పెత్తనంతో కొన్నిసార్లు కులానికి చెందినవారికి న్యాయం చేయలేకపోతున్నామని, అంత మాత్రాన తమపై విమర్శలూ ఆరోపణలూ చేయడం సరి కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+