శ్రీశాంత్ కంటతడి, నేరాన్ని అంగీకరించాడు: పోలీసులు

రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్‌లో తన పాత్రను పోలీసుల విచారణలో ఇది వరకే అంగీకరించాడు. మూడో క్రికెటర్ అజిత్ చండిలా తనపై వచ్చిన ఆరోపణలను ఇంకా అంగీకరించలేదు. ఆ ముగ్గురిని పోలీసులు గురువారం ముంబై నుంచి ఢిల్లీకి తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు వారిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది.
శుక్రవారం ముగ్గురు క్రికెటర్లను పోలీసులు విచారించారు. ఆ ముగ్గురు క్రికెటర్లతో పాటు పోలీసులు 11 మంది బుక్కీలను అరెస్టు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ఐపియల్‌ను కుదిపేసింది. శ్రీశాంత్ అమాయకుడని అతని తరఫు న్యాయవాది దీపక్ ప్రకాష్ చెప్పిన విషయం తెలిసిందే. శ్రీశాంత్ తొలుత తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించలేదు.
కాగా, ఐపియల్‌లో ఫిక్సింగ్ వార్తలు చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఐపియల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అన్నారు. ఢిల్లీ పోలీసులు చెప్పేంత వరకు ఫిక్సింగ్ జరుగుతోందని బిసిసిఐ, ఐసిసి యాంటీ కరప్షన్ యూనిట్ తెలుసుకోలేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఇప్పటికే ఐపియల్ చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోయిందని, ఈ సంఘటనతో మరింత మంది అభిమానులు లీగ్‌కు దూరమవుతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications