ఆ ముగ్గురి పైనా కన్నేసిన బుకీలు: పార్టీకి నో చెప్పారు

స్పాట్ ఫిక్సింగ్‌లో మరికొందరిని ఇన్వాల్వ్ చేయాలని బుకీలు ప్రయత్నాలు చేశారట. స్పాట్ ఫిక్సింగ్‌లో సూత్రధారిగా భావిస్తున్న అజిత్ చండిలను బుకీలు ఈ విషయమై అడిగారట. రాజస్థాన్ రాయల్స్ జట్టుకే చెందిన బ్రాడ్ హాగ్, కెవిన్ కూపర్, సిద్దార్థ త్రివేదిలను పార్టీకి తీసుకు రావాల్సిందిగా చండీలకు సూచించారట. అయితే వీరు మాత్రం నో చెప్పారట.
మరోవైపు ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై చర్చించేందుకు బిసిసిఐ వర్కింగ్ కమిటీ చెన్నైలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో బిసిసిఐ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఫిక్సంగ్ ఆరోపణలతో అరెస్టైన క్రీడాకారులపై జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉంది.
కాగా స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లు అరెస్టైన విషయం తెలిసిందే. వారిని ఢిల్లీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు. క్రికెటర్లతో పాటు పలువురు బుకీలను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి వివరాలు కూపీ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications