వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్ నో బాల్‌ వేస్ట్: జిజూ జనార్ధన్‌తో సంభాషణ

By Pratap
|
Google Oneindia TeluguNews

S Sreesanth
హైదరాబాద్: ఫిక్సింగ్ మేరకు ఓ ఓవరులో 14 పరుగులు ఇవ్వాల్సిన పేసర్ శ్రీశాంత్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడట. శ్రీశాంత్ 14 పరుగులు ఇవ్వడానికి ఓవరులో చివరి బంతిని నో బాల్ చేశాడని తేలింది. అయితే, శ్రీశాంత్ నో బాల్ వేసిన విషయాన్ని అంపైర్ గుర్తించలేదని, దాంతో సమస్య తలెత్తిందని అంటున్నారు. దాని తర్వాత శ్రీశాంత్ జిజూ జనార్దన్‌తో ఆ విషయంపై ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మే 9వ తేదీన జరిగిన మ్యాచులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

శ్రీశాంత్ తన నడుంకు టవల్ పెట్టుకుని తాను 14 పరుగులు ఇచ్చే ఓవరు వేయబోతున్నట్లు బుక్కీలకు సంకేతాలు ఇచ్చాడని అంటున్నారు. శ్రీశాంత్ షాన్ మార్ష్‌కు బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి పరుగులు రాలేదు. రెండో బంతిని మార్ష్ ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి ఒక్క పరుగు ఇచ్చాడు. ఐదో బంతికి నాలుగు పరుగులు ఇచ్చాడు. దీంతో అప్పటికి శ్రీశాంత్ 9 పరుగులు ఇచ్చాడు.

చివరి బంతికి నాలుగు పరుగులు ఇచ్చాడు. దాంతో ఓవరులో శ్రీశాంత్ 13 పరుగులు ఇచ్చాడు. అయితే, ఒక్క పరుగు తక్కువ పడింది. మరో పరుగు ఇవ్వడానికి శ్రీశాంత్ చివరి బంతిని నో బాల్ చేశాడట. అయితే, దాన్ని అంపైర్ గుర్తించలేదు. దాంతో నో బాల్‌గా ప్రకటించలేదు. దాంతో ఆందోళనకు గురైన శ్రీశాంత్ బుక్కీ జిజూ జనార్దన్‌తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఓవరును పూర్తిగా పరిశీలించడానికి పోలీసులు బిసిసిఐని ఫుటేజ్ అడిగినట్లు సమాచారం.

ఫోన్ సంభాషణలు శ్రీశాంత్, జిజూ జనార్దన్‌వేనా, కావా అనే విషయాన్ని తేల్చుకోవడానికి వాయిస్ టెస్టుకు పంపించారు. నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు.

English summary
On May 09, as the Rajasthan Royals took on the Kings XI Punjab in Mohali, Kerala pacer S Sreesanth, the Delhi Police allege, had instructions from bookies to bowl 14 runs in a fixed over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X