వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూకుడులో బ్రహ్మానందం రియాల్టీ షో: బాబుపై గండ్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విప్ పద్మరాజుతో కలిసి ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దూకుడు సినిమాలో బ్రహ్మానందం రియాల్టీ షో మాదిరిగా మహానాడులో చంద్రబాబు ఉపన్యాసం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్‌ను అహ్వానించకపోవడం చంద్రబాబు నైజానికి నిదర్శనమని ఆయన అన్నారు. చంద్రబాబును కుటుంబ సభ్యులే విశ్వసించడం లేదని ఆయన అన్నారు. 2004కు ముందు పాలనను తెస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ఆయన అడిగారు. కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కారని, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు.

జాతీయ నాయకుల కోసం చేసే కొవ్వొత్తుల ప్రదర్శన వైయస్స్రార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసం చేపడుతారా అని ఆయన అడిగారు. వైయస్సార్ కాంగ్రెసు తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలో, కేంద్రంలో బాగా పనిచేసిందని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆయన మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం వల్లనే రాష్ట్రంలో ఇద్దరు కళంకిత మంత్రులను తొలగించారని ఆయన చెప్పారు. మరో ముగ్గురుపై కూడా చర్యలు తప్పవని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులు జె. గీతారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులను ఉద్దేశించే రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించారు.

English summary
Government chief whip Gandra Venkataramana Reddy termed the Telugudesam party president Nara Chandrababu Naidu's Mahanadu speech as Brahmanandam reality show in Dookudu film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X