అఫైర్ అనుమానంతో భార్యను హత్య చేసిన వ్యక్తి

కె. దుర్గారావు అనే ఆటో డ్రైవర్ నాగ లక్ష్మిని ప్రేమించి, మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను వ్యతిరేకించి వారిద్దరు వివాహం చేసుకున్నారు. 18 నెలల క్రితం వారికి ఓ కుమారుడు పుట్టాడు. పుత్రుడు జన్మించినప్పటి నుంచి భార్యపై అతనికి అనుమానం పెరుగుతూ వచ్చింది. దాంతో తాగివచ్చి ఆమెను తరుచుగా కొడుతుండేవాడు.
సోమవారం రాత్రి అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. లక్ష్మితో గొడవ పడ్డాడు. మంగళవారం ఉదయం దుర్గారావు ఏడుస్తూ, అరుస్తూ తన భార్య గుండెపోటుతో మరణించిందని చెప్పడం ప్రారంభించాడు. స్థానికులకు అతనిపై అనుమానం కలిగింది. అతన్ని పోలీసులకు అప్పగించారు. నిద్రిస్తున్న సమయంలో భార్యను చంపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికులు దుర్గారావును పట్టుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులను పిలిచారు. దీంతో అసలు విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications