క్యాబినెట్ విస్తరణ, సోనియాతో తేడాల్లేవు: ప్రధాని

Manmohan Singh
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, ఇరువురి నిర్ణయాల్లో తేడా ఉండదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. థాయ్‌లాండు నుండి తిరిగి వస్తూ శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అన్ని అంశాలపై సోనియాతో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. పార్లమెంటు సమావేశాలలో విపక్షాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెసు పొత్తులపై ప్రధాని పై విధంగా స్పందించారు.

కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మంత్రివర్గంలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని ప్రధాని చెప్పారు. మంత్రి వర్గం నుంచి అశ్వినీ కుమార్, పవన్ కుమార్ బన్సాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెసు, డిఎంకె యుపిఎతో తెగదెంపులు చేసుకున్నాయి. దీనివల్ల కూడా మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడ్డాయి.

రాబోయే రోజుల్లో ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో సోనియాతో తాను విభేదించినట్లు అనుకున్నారని, అందులో వాస్తవం లేదని మన్మోహన్ సింగ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+