డిఎల్ ఇష్యూపై ఢిల్లీకి: కిరణ్‌పై ఫైట్‌కు చిరుతో బొత్స దోస్తీ

డిఎల్ రవీంద్రా రెడ్డి గతంలో శాఖ కోత సమయంలోనే రాజీనామా చేశారని కానీ, పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయనను బుజ్జగించి కేబినెట్లో కొనసాగించామని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఆయనను బర్తరఫ్ చేయడం సరికాదంటున్నారు. అంతగా ఇష్టం లేకుంటే ఆయనను గౌరవంగా పంపించి ఉంటే బాగుండేదంటున్నారు. ఆయన గతంలోనే రాజీనామా చేసినందున దానిని ఆమోదించినా బాగుండేదని లేదంటే ఆయన విదేశాల నుండి వచ్చాక రాజీనామా కోసం అడిగినా బాగుండేదని బొత్స వంటి వారు అభిప్రాయపడుతున్నారని సమాచారం.
సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా బర్తరఫ్‌ను తప్పు పట్టారు. అధిష్టానం, ముఖ్యమంత్రిది సరికాదని, అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మంత్రి బాలరాజు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పనా మరో మంత్రి కొండ్రు మురళీ తాను బర్తరఫ్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదంటూ తప్పించుకున్నారు. తెరాసలోకి వెళ్తున్న సీనియర్ నేత కె కేశవ రావు తప్పు పట్టారు. జానా రెడ్డి, బస్వరాజు సారయ్యలు కూడా బాధాకరమని వ్యాఖ్యానించారు.
మరోవైపు డిఎల్ రవీంద్రా రెడ్డి అనంతరం మరో ఇద్దరు మంత్రులు క్యూలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అందులో పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఉంటారని అంటున్నారు. వట్టి వసంత్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. డిఎల్ బర్తరఫ్ పైన రాష్ట్ర కాంగ్రెసులోని అసంతృప్తిని, కిరణ్ ఒంటెత్తు పోకడలను ఆయన అధిష్టానానికి వివరించనున్నారని సమాచారం.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో జానా రెడ్డి భేటీ అయ్యారు. డిఎల్ వ్యవహారంపై వారు చర్చించారు. మరోవైపు సి.రామచంద్రయ్య తొలగింపు ప్రచారం నేపథ్యంలో కిరణ్ పైన అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసేందుకు బొత్స కేంద్రమంత్రి చిరంజీవి వర్గాన్ని కలుపుకు పోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గతంలోనే కిరణ్‌కు వ్యతిరేకంగా దామోదర, బొత్స తదితరులు సమావేశాలు నిర్వహించినట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications