విష్ణుమూర్తిగా ఎమ్మెస్ ధోనీ: అనంతపురంలో కేసు

కాగా, విష్ణు అవతారంలో ఎమ్మెస్ ధోనీని చిత్రించి, హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడనే ఆరోపణపై బెంగళూర్‌లోని స్థానిక కోర్టులో కేసు నెల రోజుల క్రితం నమోదైంది. ఓ సామాజిక కార్యకర్త జయకుమార్ హీరోమత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ (ఎసిఎంఎం) చూరి ఖాన్ సెక్షన్ 295 కింద, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు.
విష్ణు దేవుడి అవతారంలో ధోనీని చిత్రించి, ఒక చేతులతో బూట్లతో పాటు పలు వస్తువులను పట్టుకున్నట్లు ఓ బిజినెస్ మ్యాగజైన్‌పై అచ్చు వేయడం వల్ల హిందువుల దేవుడిని అవమానించారని, తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని హీరేమత్ ఆరోపించారు.
ధోనీతో పాటు అప్పుడు ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. బిజినెస్ మ్యాగజైన్‌పై విష్ణువు అవతారంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించడంపై ఇప్పటికే తీవ్ర వివాదం చెలరేగింది. వాణిజ్య ప్రకటనకు ధోనీని విష్ణువు అవతారంలో చిత్రించి, మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురించారు.












Click it and Unblock the Notifications