రితీ స్పోర్స్ట్‌తో నాకేం సంబంధం లేదు: ఆర్పీ సింగ్

ధోనీ నాయకత్వం వహిస్తున్న ఐపియల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనే రైనా, జడేజా ఉన్నారు. వార్తాకథనంలో ఏముందో స్పష్టంగా తనకు తెలియదని, అయితే తనకు రితీ స్పోర్ట్స్‌తో ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలుచుకున్నానని ఆర్పీ సింగ్ ట్వీట్ చేశాడు.
భారత తరఫున ఆర్పీ సింగ్ 14 టెస్టు మ్యాచులు, 58 వన్డే మ్యాచులు ఆడాడు. టెస్టు మ్యాచుల్లో అతను 40 వికెట్లు తీసుకోగా, వన్డేల్లో 60 వికెట్లు తీసుకున్నాడు. రితీ స్పోర్ట్స్ యజమాని అరుణ్ పాండే ధోనీకి సన్నిహిత మిత్రుడు.
ధోనీ 2010లో రితీ స్పోర్ట్స్‌తో 210 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి సగటున 70 కోట్ల రూపాయలు అవుతుంది. క్రికెట్ క్రీడా రంగంలో ఇది అత్యంత ఖరీదైన డీల్.












Click it and Unblock the Notifications