నేతలకు విజయమ్మ క్లాస్: స్థానిక ఎన్నికలపై దృష్టి

పార్టీ 14 నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు విజయమ్మ చెప్పారు. ఈ నెల 14వ తేదీన తిరుపతిలో, 16వ తేదీన విజయనగరంలో, 18వ తేదీన విజయవాడలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఆమె పార్టీ నాయకులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని ఆమె చెప్పారు.
క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పార్టీ నాయకులను ఆదేశించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలులో ఉన్న నేపథ్యంలో పార్టీని పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడానికి వైయస్ విజయమ్మ నడుం బిగించారు. వచ్చే శానససభ, లోకసభ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఉంది.












Click it and Unblock the Notifications